ఘోరం.. ఓ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపిన మహిళలు (వీడియో)

by Disha Web Desk 6 |
ఘోరం.. ఓ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపిన మహిళలు (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్: బెంగుళూరులో దారుణం ఘటన చోటుచేసుకుంది. కప్ అగ్రహార ప్రాంతంలో అర్ధరాత్రి 30 ఏళ్ల వ్యక్తిని ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు దాడి చేశారు. అతి కిరాతకంగా అందరూ కలిసి గట్టిగా పట్టుకొని రాళ్లతో కొట్టారు. బాధితుడి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు బయటకు వచ్చి అతడిని ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు. దాడి చేసిన వారిని ఇంకా గుర్తించలేదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ః


Next Story