మండల కేంద్రంలో మాయగాడు..పెట్రోల్ పోయించుకొని పరార్..

by Disha Web |
మండల కేంద్రంలో మాయగాడు..పెట్రోల్ పోయించుకొని పరార్..
X

దిశ, భిక్కనూరు : కారులో పెట్రోల్ పోయించుకొని, డబ్బులివ్వకుండా పరారైన ఘటన భిక్కనూరు మండలం సిద్ధరామేశ్వర్ నగర్ (రైల్వేస్టేషన్) సమీపంలోని 44వ జాతీయ రహదారి పై ఉన్న శ్రీవల్లి పెట్రోల్ బంకులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న కారు(యూ పీ 32 కే ఆర్ 0077) బంక్ కు వచ్చి44 లీటర్ల పెట్రోల్ పోయించుకున్నాడు. పెట్రోల్ పోసిన వర్కర్ డబ్బుల కోసం అడుగుతుండగా, కారులో కూర్చున్న యజమాని, అటు ఇటు జేబులని సర్దుతూ ఒక్కసారి వేగాన్ని పెంచడంతో, కార్ డోర్ ను పట్టుకొని బంకు వర్కర్ పి.మహేష్ కొద్దిదూరం పరిగెత్తి కింద పడిపోయి గాయపడ్డాడు.

ఈ విషయాన్ని క్యాబిన్ లో కూర్చొని గమనిస్తున్న బంకు నిర్వాహకుడు అతిమాముల శ్రీనివాస్ ద్విచక్ర వాహనాన్ని తీసుకొని జంగంపల్లి వరకు వెతికినప్పటికీ, ఆచూకీ దొరకకుండా కారును స్పీడ్ గా తీసుకెళ్లాడు. దీంతో చేసేదేమి లేక వెను తిరిగి వచ్చేశాడు. బంకులోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫుటేజ్ ల ఆధారంగా రాత్రి నిర్వాహకుడు భిక్కనూరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేశాడు.


Next Story