అలా వచ్చాడు.. ఇలా తెంపుకెళ్లాడు..

by Sridhar Babu |
అలా వచ్చాడు.. ఇలా తెంపుకెళ్లాడు..
X

దిశ, మెట్ పల్లి : మొక్కు చెల్లించుకునేందుకు వచ్చిన మహిళ మెడలోంచి పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఘటన మెట్ పల్లి మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ జిల్లా లక్ష్మన్ చందా మండలం మునుపల్లి గ్రామానికి చెందిన దోడ రమ్య, భర్త నర్సారెడ్డి వారి కుమారుడితో కలిసి మంగళవారం మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో ఉన్న ఎల్లమ్మ దేవాలయానికి మొక్కు తీర్చుకుందామని వచ్చారు. మధ్యాహ్నం రమ్య తన కొడుకుకు అన్నం తినిపిస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి రమ్య మెడలో ఉన్న రెండు తులాల పుస్తెలతాడును తెంపుకొని పారిపోయాడు. బాధితురాలు దొడ రమ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.



Next Story

Most Viewed