రాజ‌లింగ‌మూర్తి హ‌త్య‌కేసులో హరిబాబు అరెస్టు

by Sridhar Babu |
రాజ‌లింగ‌మూర్తి హ‌త్య‌కేసులో హరిబాబు అరెస్టు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సామాజిక కార్య‌క‌ర్త రాజ‌లింగ‌మూర్తి హ‌త్య కేసులో నిందితుడైన కొత్త హ‌రిబాబును మంగ‌ళ‌వారం భూపాల‌ప‌ల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆయ‌న పారిపోవ‌డానికి స‌హ‌క‌రించిన ములుగు జిల్లాకు చెందిన వట్టే రమణయ్య, రమ అనే ఇద్దరిని సైతం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. గత నెల భూపాలపల్లి పట్టణంలో జరిగిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో భూపాల‌ప‌ల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మ‌న్‌, బీఆర్ ఎస్ నేత కొత్త హరిబాబును నిందితుడిగా గుర్తించారు.

ఆయ‌న కోసం ప్రత్యేక బృందాలు గ‌త కొద్ది రోజులుగా శోధిస్తూ వ‌చ్చాయి. మూడు ప్రత్యేక బృందాలు ఢిల్లీ, జైపూర్, ఆగ్రా తదితర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి చివరికి నిందితుని ఆచూకీ తెలుసుకొని పోలీసులు అరెస్టు చేశారు. మంగ‌ళ‌వారం భూపాల‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌లో నిందితుల అరెస్టును చూపిన పోలీసులు అనంత‌రం కోర్టులో రిమాండ్ చేశారు. ఇప్ప‌టికే అరెస్ట‌యిన వారిని పోలీసులు క‌స్ట‌డీకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా హ‌రిబాబు పోలీసుల‌కు చిక్క‌డంతో కేసును కొలిక్కి తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉంది.



Next Story

Most Viewed