- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అత్యాశకు పోగా అసలుకే మోసం అయింది...

దిశ, సుల్తానాబాద్ : అనతి కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదగాలని అత్యాశకు పోయి గంజాయి విక్రయిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం సుల్తానాబాద్ మండల కేంద్రంలోని శాస్త్రి నగర్ లో నివాసముంటున్న వేముల శ్రీనివాస్ గతంలో టిఫిన్ సెంటర్ నిర్వహించి వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో గోదావరిఖనిలో ఓ హోటల్లో జీతం ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో అనతి కాలంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించి జల్సా జీవితం గడపాలని భావించి అత్యాశకు పోయి కేసులో ఇరుక్కున్నాడు.
గతంలో తన చిన్న కుమారుడు చంద్ర ప్రకాష్ మహారాష్ట్ర చంద్రపూర్ నుండి గంజాయి తీసుకువచ్చి తమ గృహంలో నిల్వ ఉంచేవాడని తెలిపారు. కరీంనగర్ లో దొంగతనం కేసులో పోలీసులకు దొరికి జైలు జీవితం గడుపుతున్నాడని ఎస్సై తెలిపారు. గతంలో మహారాష్ట్ర నుండి తీసుకువచ్చిన గంజాయిని అధిక డబ్బులు వస్తాయని లక్ష్యంతో శ్రీనివాస్ చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తుండేవాడని, మరో 34 గ్రాముల గంజాయిని తన గృహంలో ఉంచుకొని ఫ్యాక్టరీలలో పనులు చేస్తున్న కార్మికులకు విక్రయించేందుకు వెళ్తుండగా పోలీసులు శాస్త్రి నగర్ లో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా 34 గ్రాముల గంజాయి దొరికింది. దాంతో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై శ్రవణ్ కుమార్ తెలిపారు.