బంగారాన్ని అండర్వేర్‌లో దాచి అక్రమ రవాణా..

by Disha Web Desk 13 |
బంగారాన్ని అండర్వేర్‌లో దాచి అక్రమ రవాణా..
X

దిశ, శంషాబాద్: గుట్టు చప్పుడు కాకుండా విదేశాల నుండి యదేచ్ఛగా బంగారం తరలిస్తూ.. కస్టమ్స్ అధికారులకు పట్టుబడిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం దుబాయ్ నుండి (AI-952) ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ప్రయాణికుడిపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన అధికారులు అతన్ని తనిఖీ చేశారు. ప్రయాణికుడు బంగారాన్ని అండర్వేర్‌లో పెట్టుకొని తరలిస్తుండగా పట్టుకున్నారు. ప్రయాణికుని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించారు. ప్రయాణికుని వద్ద 15 లక్షల 45 వేల రూపాయల విలువ చేసే 300 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed