గోవా మద్యం స్వాధీనం.. నలుగురి అరెస్ట్​

by Dishafeatures2 |
గోవా మద్యం స్వాధీనం.. నలుగురి అరెస్ట్​
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: గోవా నుంచి మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్న నలుగురిని ఘట్​కేసర్ ​ఎక్సయిజ్ ​పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 521 మద్యం సీసాలు, కారు, డీసీఎం వ్యాన్ ను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. గోవా నుంచి తెచ్చిన మద్యం రవాణా అవుతున్నట్టు సమాచారం అందటంతో మంగళవారం రాత్రి ఘట్​కేసర్​ పోలీసులు బోడుప్పల్​లోని బంగారు మైసమ్మ ఆలయం వద్ద రూట్​ వాచ్​ పెట్టారు. అదే సమయంలో ఉప్పల్​మల్లికార్జుననగర్​నివాసి ఏ.జగదీశ్వర్​ద్విచక్ర వాహనంపై అటుగా వచ్చాడు. అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని పట్టుకుని తనిఖీ చేయగా పది మద్యం బాటిళ్లు దొరికాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంట్లో జగదీశ్వర్​బోడుప్పల్​టెలిఫోన్​కాలనీలో నివాసముంటున్న పున్నా బాలరాజు వద్ద కూడా గోవా మద్యం బాటిళ్లు ఉన్నట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో పోలీసులు కారులో వెళుతుండగా బాలరాజును పట్టుకున్నారు.

తనిఖీ చేయగా అయిదు బ్యాగుల్లో ప్యాక్​చేసి ఉన్న 107 లీటర్ల మద్యం సీసాలు దొరికాయి. ఇక, జగదీశ్వర్​ఇచ్చిన సమాచారం మేరకు సిద్దిపేట శ్రీనగర్​కాలనీకి చెందిన తాళ్లపల్లి హరికృష్ణగౌడ్​ను అదుపులోకి తీసుకోగా అతని వద్ద 614.25 లీటర్ల మద్యం సీసాలు పట్టుబడ్డాయి. ఇక, హరికృష్ణగౌడ్​విచారణలో వెల్లడించిన వివరాల మేరకు నాచారం అంబేద్కర్​భవన్​ప్రాంతంలో ఉంటున్న ఏ.సురేందర్​ను పట్టుకున్నారు. అతని వద్ద కూడా పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లు దొరికాయి. సీజ్​చేసిన మద్యం మొత్తం నాన్​డ్యూటీ పెయిడ్​దేనని అధికారులు తెలిపారు. దాడుల్లో ఎక్సయిజ్​అధికారులు మల్లయ్య, శ్రావణి, అశోక్, మక్భూల్, వెంకట్​రెడ్డి, రాఘవేందర్, నరేశ్, రాజేశ్, దీపిక, ఎం.దీపిక పాల్గొన్నారు.

Next Story