- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
24 రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిన గౌసుద్ధీన్
by Sridhar Babu |

X
దిశ, మంగపేట : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సయ్యద్ గౌసుద్ధీన్ (23) అనే ఆటో డ్రైవర్ హైద్రాబాద్ నిమ్స్ లో వైద్యం పొందుతూ ఆదివారం మృతి చెందాడు. దాంతో మండలంలోని కమలాపురం ఎస్సీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 16న రాత్రి కమలాపురం నుండి రైతులకు చెందిన మిర్చీని తన టాటా ఏస్ ఆటోలో హుజురాబాద్ మార్కెట్ కు తరలిస్తున్న క్రమంలో ఆగివున్న లారీని వెనుక నుండి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రెండు కాళ్లు విరిగి నుజ్జు నుజ్జు కాగా తలకు శరీరానికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడ్డ గౌసుద్దీన్ ను వరంగల్ ఎంజీఎంకు, అక్కడ నుండి హైద్రాబాద్ నిమ్స్ కు తరలించి 22 రోజులుగా వైద్యం అందిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు.
Next Story