- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నగరంలో ఓజీ గంజాయి ముఠా గుట్టురట్టు.. జూనియర్ ఆర్టిస్టుల సాయంతో స్మగ్లింగ్
బ్యాంకాక్ టు హైదరాబాద్ ఓజీ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టైంది.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో అంతర్జాతీయ ఓజీ గంజాయి (OG Weed) స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టైంది. ఈగల్ ఫోర్స్ (EAGLE Force), కస్టమ్స్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు కలిసి నిర్వహించి జాయింట్ ఆపరేషన్‌లో హైదరాబాద్‌కు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ దొడ్డి సూరికళ (Doddi Suri Kala) పట్టుబడింది. నిందితురాలి నుంచి భారీ ఎత్తున విదేశీ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు ఈగల్ ఫోర్స్, కస్టమ్స్ అధికారులు బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ దొడ్డి సూరికళను ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఆమె లగేజీని తనిఖీ చేయగా బ్యాగుల్లో దాచి ఉంచిన 2.15 కిలోల హై-క్వాలిటీ ఓజీ వీడ్ (OG Weed) గంజాయి లభ్యమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.లక్షల్లో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మహిళలకు ఫ్రీ ఫారిన్ ట్రిప్పుల ఎర..
బ్యాంకాక్-ఇండియా రూట్‌లో సాగుతున్న ఈ భారీ గంజాయి రవాణా నెట్‌వర్క్‌ను ఈగల్ టీమ్ క్రాక్ చేసింది. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాధారణ మహిళలు, జూనియర్ ఆర్టిస్టులను టార్గెట్ చేసుకుని ఈ అంతర్జాతీయ ముఠా మోసాలకు పాల్పడుతోంది. ఫ్రీ ఫారిన్ ట్రిప్స్ ఎరగా వేసి వారి నుంచి భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేయిస్తున్నట్లు ఇన్వేస్టిగేషన్‌లో వెల్లడైంది. అరెస్ట్ అయిన జూనియర్ ఆర్టిస్ట్ సూరికళను ఈ డ్రగ్స్ ముఠా ఇప్పటికే మూడు సార్లు బ్యాంకాక్‌కు పంపినట్లుగా అధికారులు గుర్తించారు. ట్రిప్ ఖర్చులన్నీ ముఠానే భరిస్తూ, ఆమె లగేజీ ద్వారా రహస్యంగా డ్రగ్స్ సరఫరా చేయిస్తున్నట్లుగా విచారణలో ఒప్పుకుంది. ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు (Drug Peddlers) ఎవరు.. నగరానికి ఎవరికి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి.. అనే కోణంలో ఎన్సీబీ, ఈగల్ ఫోర్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.






