- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
విదేశీ మహిళపై సామూహిక అత్యాచారం..

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో రోజురోజుకూ మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఇలాంటి ఘటనలు నిత్యం జరుగడం మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా గుర్గావ్‌లో మరో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. గుర్గావ్‌లోని బ్రిస్తోల్ చౌక్‌లో తాను నివాసం ఉండే దక్షిణ ఢిల్లీ చత్తపూర్‌కు వెళ్లేందుకు క్యాబ్ కోసం ఎదురుచూస్తున్న మహిళను ముగ్గురు యువకులు కారులో వచ్చి చత్తపూర్‌లో దింపుతామని నమ్మబలికి కారు ఎక్కించుకున్నారు. అనంతరం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. మొత్తం ఐదుగురు కలిసి అతి దారుణంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో అని భయపడ్డ దుండగులు ఆమెను అపస్మారకస్థితిలోకి వెళ్లేలా త్రీవంగా కొట్టి గుర్గావ్‌లోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో పడేసి వెళ్లారు. కొంత సేపటికి తేలుకున్న బాధితురాలు నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కారు నెంబర్ ఆధారంగా ఐదుగురు నిందితుల్లో ముగ్గుర్ని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా మహిళను గుర్గావ్‌లోని ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. దాంతో పోలీసు నిందితులపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.