- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అయ్యయ్యో! ఎంత పని అయింది..స్నేహితుల సలహాలు ద్వారా మోసం
దిశ, ఏదుల/గోపాల్పేట: నకిలీ మొబైల్ యాప్ సంస్థల ద్వారా వేలాది మంది మోసపోతున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ సమాజం పట్ల అవగాహన ఉండి కూడా కొంతమంది చదువుకున్న వ్యక్తులే వేక్ యాప్ ల ద్వారా డబ్బులు రెట్టింపు అవుతాయని ఒక పిచ్చి నమ్మకంతో డబ్బులను తమకు తామే మోసం చేసుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంలోని ఓ రేషన్ డీలర్ తన స్నేహితుల సలహాలతో 2024 సంవత్సరం, ఫిబ్రవరి నెలలో వేక్ యాప్ లోడబ్బులు పెడితే రెట్టింపు అవుతాయని చెప్పడంతో ఆ వ్యక్తి తన అకౌంట్ నుంచి అలాగే తన భార్య అకౌంట్ నుండి దాదాపు రూ.4,60,000 రూపాయలు వెక్ యాప్ లో జమ చేశాడు. మొదటగా కొంత డబ్బు రిటర్న్ వచ్చింది. కానీ కొన్ని రోజుల తర్వాత వేక్ యాప్ పనిచేయకపోవడంతో అయ్యో మోసపోయానని తెలుసుకొని శనివారం గోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు.