- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్
దిశ, సత్తుపల్లి : గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన సత్తుపల్లి పట్టణ పరిధిలోని వేంసూర్ రోడ్డులో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లి వేంసూర్ రోడ్డులో మెట్ట ఆంజనేయ స్వామి గుడి దగ్గర కందిమళ్ల కృష్ణారావు మామిడి తోటలో యువకులు గంజాయి అమ్ముతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. దాంతో నలుగురు యువకులు పట్టుబడగా, మరో ఇద్దరు పరారయ్యారు. పట్టుబడిన వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించారు.
వారి వద్ద నుంచి రూ.2782 విలువైన 111.29 గ్రాముల గంజాయి, రెండు బైకులు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఆరుమల్ల తరుణ్ కుమార్, సిద్ధారం గ్రామానికి చెందిన జగం అఖిల్, రేజర్ల గ్రామానికి చెందిన కలపాల రాంబాబు, ఎన్టీఆర్ కాలనీకి చెందిన షేక్ ఇబ్రహీం ఉన్నారు. పరారైన వారిలో రేజర్ల గ్రామానికి చెందిన జుంజ్జు నూరి సింహాద్రి అలియాస్ సందీప్, వేంసూరు మండలం లింగ పాలెం గ్రామానికి చెందిన శ్రీ నాథ్ ఉన్నట్లు కల్లూరు ఏసీపీ అనిశెట్టి రఘు తెలిపారు. ఈ కేసులో సహకరించిన పట్టణ సీఐ టి. కిరణ్, ఎస్ ఐ రఘు, పలువురు పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.