అదుపు తప్పి ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు

by Disha Web |
అదుపు తప్పి ఆటో బోల్తా.. ఐదుగురికి గాయాలు
X

దిశ,ఆమనగల్లు : ఆటో అదుపు తప్పి ఐదుగురు గాయాలపాలైన సంఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మక్తమాధారం గ్రామశివారులో ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం కేశంపేట మండల కేంద్రానికి చెందిన లక్షమమ్మ, యాదగిరి, సోని, మరో ఇద్దరు వ్యక్తులు ట్రాలీ ఆటోలో కడ్తాల్ నుంచి కేశంపేట వెళుతుంది.

సరిగ్గా మక్తమాధారం గ్రామ శివారు ప్రాంతం రాగానే ఆటో అదుపు తప్పి గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో లక్షమమ్మ, యాదగిరి, సోని త్రీవంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి స్వల్పగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డవారిని బయటకు తీశారు. మరో ఆటోలో చికిత్స కోసం షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని కడ్తాల్ పోలీసులు సందర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.
Next Story