స్కూల్ వ్యాన్, కారు ఢీ.. అక్కడికక్కడే ఐదుగురు మృతి

by Satheesh |
స్కూల్ వ్యాన్, కారు ఢీ.. అక్కడికక్కడే ఐదుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం సమయంలో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ వ్యాన్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఆరుగురు స్కూల్ విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన స్కూల్ విద్యార్థులను చికిత్స నిమిత్తం తెంకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇక, ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed