వేగంగా వెళుతున్న బొలేరో.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు..

by Sumithra |
వేగంగా వెళుతున్న బొలేరో.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు..
X

దిశ, తూప్రాన్ : మనోహరాబాద్ మండలం కాళ్లకల్ శివారులో బులెరో వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో వాహనం ముందు భాగం మొత్తం కాలిపోయింది. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు 44 జాతీయ రహదారి పై వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా ఇంజిన్ లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగడంతో వాహనాన్ని డ్రైవర్ రోడ్డు పక్కన నిలిపివేశాడు.

Next Story

Most Viewed