కాప్రాలోని హెల్త్ అండ్ గ్లో షోరూంలో అగ్ని ప్రమాదం..

by Sumithra |
కాప్రాలోని హెల్త్ అండ్ గ్లో షోరూంలో అగ్ని ప్రమాదం..
X

దిశ, కాప్రా : కుషాయిగూడ పోలీసుస్టేషన్ పరిధిలోని హెల్త్ అండ్ గ్లో కాస్మోటిక్స్ షోరూంలో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించినది . ఏఎస్ రావునగర్ ప్రధాన రహదారి పై పక్కనేవున్న ఈ షోరూంలో అర్ధరాత్రి 11 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. షోరూంలోని కస్మోటిక్ ప్రొడక్ట్స్ కు మంటలు వ్యాపించి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, మూడు ఆగ్నిమాపక శకటాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోనికి తెచ్చారు.

సిబ్బంది అప్రమత్తతో మొదటి, రెండో అంతస్తులకు మంటలు వ్యాపించకుండా మంటలను అదుపు చేశారు. షాట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బేతీ సుభాష్ రెడ్డి , స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి , మాజీ కార్పొరేటర్ పావని మణిపాల్ రెడ్డి కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్ అదికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.Next Story

Most Viewed