ఆమనగల్లు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

by Disha Web |
ఆమనగల్లు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
X

దిశ, ఆమనగల్లు: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండల పరిధి చంద్రాయన్ పల్లి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒక్కరు తీవ్ర గాయాల పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మాడుగుల మండలపరిధి కలకొండ గ్రామపంచాయతీ సండ్రాల గడ్డ తండాకు చెందిన గిరిజనుల కుటుంబం ఆమనగల్లు పట్టణ కేంద్రంలో శుభాకార్యానికి వెళ్లి ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు.

సరిగ్గా మాడ్గుల మండల చంద్రయాన్ పల్లి సమీపంలో రాగానే ట్రాక్టర్ ఆటోని ఢీక్కొట్టింది. దీంతో నుచ్చుగుట్ట తండాకు చెందిన శాంతి(45), శాంతి అన్న పత్య, మేనల్లుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రగాయాలపాలయ్యారు. శాంతి భర్త బిక్కు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు.
Next Story