లక్కంపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం

by Disha Web Desk 1 |
లక్కంపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం
X

ఇద్దరు మహిళలు, ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు

దిశ, నందిపేట్ : ఆటో, కారు ఢీకొని ఆటో నుజ్జునుజ్జు కాగా, ఇద్దరు మహళలకు తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలోని లక్కంపల్లి వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లక్కంపేట నుంచి వస్తున్న ఆటో, నందిపేట నుంచి వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే విధంగా ఆటో డ్రైవర్ కంటి తీవ్రగాయలం అయ్యింది. చౌదరి లక్ష్మి అనే మహిళకు రెండు కాళ్లు విరిగిపోగా, రాంపురం సాయమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటంతో ముగ్గురిని ఒకే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Next Story

Most Viewed