- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
భాగ్యనగర్ తండాలో ఘోర రోడ్డు ప్రమాదం...ముగ్గురు మృతి
దిశ, కారేపల్లి : సింగరేణి మండలం భాగ్యనగర్ తండా బొడ్రాస్ కుంట సమీపంలో అతివేగంతో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా ఒకరి పరిస్థితి విషమంగా మారింది. గాయపడిన వ్యక్తిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. సింగరేణి మండలం గుట్ట కింద గుంపు గ్రామానికి చెందిన ఉండెం సూర్యనారాయణ (45), సుగుణ దంపతులు వారి పనుల రీత్యా ఇల్లందు వెళ్లి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. అదే సమయంలో సింగరేణి సోలార్ ప్లాంట్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరుగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాకుళంవాసి నక్క వెంకటేష్ (35), ధరావత్ రాజు (28) కలిసి కారేపల్లి నుండి బైక్ పై వస్తున్నారు.
భాగ్యనగర్ తండా బోడ్రాస్ కుంట సమీపంలోకి రాగా సూర్యనారాయణ, వెంకటేష్ బైక్లు పరస్పరం ఢీకొన్నాయి. దాంతో గుట్టకింద గుంపు గ్రామానికి చెందిన ఉండెం సూర్యనారాయణ, సుగుణ అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే సింగరేణి సోలార్ ప్లాంట్ లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నక్క వెంకటేశ్ కూడా మృతి చెందాడు. వెంకటేశ్ అతివేగంతో వాహనాన్ని ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ధరావత్ రాజుకు బలమైన గాయాలు కాగా ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.
- Tags
- road accident