నీటి గుంతలో పడి రైతు మృతి

by Kalyani |
నీటి గుంతలో పడి రైతు మృతి
X

దిశ, చిన్నశంకరంపేట: ప్రమాదవశాత్తూ వ్యవసాయ పొలంలోని నీటి గుంతలో ఓ వ్యక్తి పడి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై నారాయణ గౌడ్ వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్. కొండాపూర్ గ్రామపంచాయతీ గెరిల్లా తండాకు చెందిన నునావత్ మోహన్ ( 45) తన వ్యవసాయ పొలంలో నీటి నిల్వ కోసం ఓ గుంతను ఏర్పాటు చేసుకున్నారు. అయితే శనివారం తన వ్యవసాయ పొలంలో పని చేయడానికి వెళ్లి అక్కడే ఉన్న నీటి నిల్వ గుంతలో ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడని తెలిపారు. మృతుని భార్య సునీత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా స్థానిక ఎస్సై నారాయణ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed