గిరిజన గ్రామాల్లో ఆబ్కారి జల్లెడ

by Sridhar Babu |   ( Updated:2025-02-06 13:22:44.0  )
గిరిజన గ్రామాల్లో ఆబ్కారి జల్లెడ
X

దిశ,డోర్నకల్ : గుడుంబా నిర్మూలనకు ఆబ్కారి అధికారులు వరుస దాడులకు దిగుతున్నారు. గురువారం హున్య తండా, బోడహట్య తండా, మహబూబాబాద్ పరిధిలో సారా స్థావరాల్లో జల్లెడ పట్టారు. రెండున్నర క్వింటాల బెల్లం, 46 లీటర్ల సారా,1000 లీటర్ల బెల్లం పానకం, ద్విచక్ర వాహనం సీజ్ చేసి,10 మందిపై కేసు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు సీఐ చిరంజీవులు తెలిపారు. మానుకోట ఎక్సైజ్, డీటీఎఫ్, వరంగల్ ఎన్ఫోర్స్మెంట్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపారు. 'సీఐలు చంద్రశేఖర్, అశోక్,కి రీటి పాల్గొన్నారు.

Next Story