జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధిమారలే...

by Sridhar Babu |
జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధిమారలే...
X

దిశ, సుల్తానాబాద్ : పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గల మెడికల్ షాప్ లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని 24 గంటలు గడవక ముందే పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. ఎస్సై శ్రవణ్ కుమార్ కథనం ప్రకారం మండల కేంద్రంలోని శాస్త్రి నగర్ కు చెందిన పాత నేరస్తుడు వేముల భవాని ప్రకాష్ అలియాస్ బబ్లు (27) గతంలో టిఫిన్ సెంటర్ నిర్వహించే వాడు. జల్సా జీవితానికి అలవాటు పడి టిఫిన్ సెంటర్ లో వచ్చిన డబ్బు సరిపోకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో దొంగతనాలు ఎంచుకొని గతంలో అనేకసార్లు జైలు జీవితం గడిపి వచ్చాడు.

శనివారం మండల కేంద్రంలోని శివశంకర్ మెడికల్ షాప్ లో రాత్రి సమయంలో దుకాణం మూసి ఉండడాన్ని గమనించి షట్టర్ కు వేసిన తాళం రాడ్ తో పగలగొట్టి లోపలికి ప్రవేశించి కౌంటర్లో ఉన్న 24 వేల రూపాయలు, ఒక సెల్ ఫోన్ చోరీ చేశాడు. పోలీసులు 24 గంటలు గడవకముందే పూసల రోడ్డులో మధ్యాహ్నం సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకొని తమదైన పద్ధతిలో విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించాడు. దాంతో 18 వేల రూపాయలు, సెల్ ఫోన్ రికవరీ చేసి కేసు నమోదు చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Next Story

Most Viewed