ఒక్కసారిగా కుప్పకూలిన కోల్డ్ స్టోరేజ్ బిల్డింగ్.. 8 మంది స్పాట్ డెడ్

by Satheesh |
ఒక్కసారిగా కుప్పకూలిన కోల్డ్ స్టోరేజ్ బిల్డింగ్.. 8 మంది స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సంబాల్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఓ కోల్డ్ స్టోరేజ్ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మరికొందరు స్టోరేజ్ శిథిలాల కింద ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితులను కాపాడేందుకు రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed