- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైద్యుల నిర్లక్ష్యం...చిన్నారికి శాపం

దిశ, తిరుమలగిరి : సికింద్రాబాద్ బోయినపల్లిలో ఇటీవల వివాదాల్లో చిక్కుకున్న ఓ మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ ఆసుపత్రిలో 7 నెలల చిన్నారికి సరైన వైద్యం అందించలేదంటు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. హస్మత్ పేటకు చెందిన షేక్ మోయిజ్ తన కుమారుడు షాజన్ కు ఇన్ఫెక్షన్ సోకడంతో శనివారం రాత్రి ఆ ప్రైవేటు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆ 7 నెలల చిన్నారికి సెలైన్ ఎక్కించేందుకు సుమారు 10 చోట్ల చేతికి, కాళ్లకు సూదులు గుచ్చడంతో ఆ పదిచోట్ల నుండి రక్తం కారి ఆ చిన్నారి చేతికి అనేక గాయాలయ్యాయి.
ఇదే విషయమై ఆసుపత్రి యాజమాన్యాన్ని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి మీ దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు బాధితులు పేర్కొన్నారు. 7 నెలల చిన్నారికి సరైన వైద్యం అందించలేదని కుటుంబ సభ్యులు అన్నారు. గత 15 రోజుల క్రితం ఇదే ఆసుపత్రిలోని వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక మనిషి ప్రాణాలు కూడా కోల్పోయినట్లు తెలిపారు. ఇలాంటి ప్రైవేటు ఆసుపత్రులపై జిల్లా వైద్యాధికారులు, కంటోన్మెంట్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ విషయంపై చర్యలు తీసుకోనట్లయితే తమ కులసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.