- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తల్లి ఫోన్ ఇవ్వలేదని కూతురు ఎంతకు తెగించిందో తెలుసా....

దిశ, కౌటాల : ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కౌటాల మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బొమ్మకట్టి సదానందం, రమాదేవి దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు బొమ్మకంటి స్ఫూర్తి (16) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో చదువుతుంది. కూతురు స్ఫూర్తి ఉదయం పాఠశాలకు వెళ్లి తిరిగి ఏడు గంటలకు తండ్రి సదానందంతో కలిసి ఇంటికి వచ్చింది. కూతురిని ఇంట్లో దింసి సదానందం బయటికి వెళ్లిపోయాడు. స్టడీ మెటీరియల్ ఫోన్లో పీడీఎఫ్ ఉందని, ఫోన్ ఇవ్వమని తల్లి రమాదేవిని స్ఫూర్తి అడిగింది.
తల్లి రమాదేవి ఫోన్ ఇస్తే గేమ్స్ ఆడి సమయం వృథా చేస్తావని, నీకు కావలసిన మెటీరియల్ జిరాక్స్ కాపీలు తీసుకొని వస్తాను అని చెప్పి తల్లి రమాదేవి బయటకు వెళ్లింది. దీంతో మనస్థాపానికి గురై స్ఫూర్తి ఇంట్లో చీరతో ఫ్యానుకు ఉరేసుకుంది. తల్లి రమాదేవి జిరాక్స్ కాపీలతో ఇంటికి వచ్చేసరికి ఫ్యానుకు ఉరేసుకున్న స్ఫూర్తిని చూసి వెంటనే తండ్రి సదానందంకి కాల్ చేసింది. తండ్రి సదానందం వచ్చి స్ఫూర్తిని కిందికి దింపి వెంటనే కౌటాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కౌటాల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సిర్పూర్ టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే స్ఫూర్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి సదానందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కౌటాల ఎస్సై మధుకర్ తెలిపారు.