గుండెపోటుతో టీఎన్ జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు మృతి..

by Sumithra |
గుండెపోటుతో టీఎన్ జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడు మృతి..
X

దిశ, సంగారెడ్డి : గుండెపోటుతో టీఎన్జీఓ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సుశీల్ కుమార్ మృతి చెందారు. బుధవారం సంగారెడ్డి కార్యాలయంలో విధులు ముగించుకుని తన నివాసంలో ఉండగా తీవ్ర గుండె నొప్పి రాగా కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కాగా ఆయన మార్గమధ్యంలో మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. సుశీల్ కుమార్ అకాల మరణం విషయం తెలుసుకున్న టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షడు పలు ఉద్యోగ సంఘం నాయకులు గురువారం నివాళులు అర్పించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సుశీల్ బాబు అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

టీఎన్జీఓల సంఘం రాష్ట్ర అద్యక్షడు మామిళ్ల రాజేందర్ ఆయనకు నివాళులు అర్పించడంతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం కలెక్టరేట్ లో ఉద్యోగ సంఘాల నాయకులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ సునీల్ బాబు మరణం తీవ్రంగా కలచివేసిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవలను ఉమ్మడి మెదక్ జిల్లాకు, సంగారెడ్డి జిల్లాకు ఉద్యోగులకు చేసిన సేవల్ని మరువలేమని కొనియాడారు. కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కమర్షియల్ టాక్స్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బంగాలి వెంకటయ్య , తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణ యాదవ్, రాయగంటి ప్రతాప్, కమర్శియల్ ట్యాక్స్ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుసేని , ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెంకటేష్, విక్రమ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed