రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

by Disha Web |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
X

దిశ, తాడ్వాయి : మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దేవయిపల్లి గ్రామానికి చెందిన కాంట్రాల మల్లయ్య (40) తాడ్వాయి గ్రామంలో పనిచేసుకుని తిరిగి స్వగ్రామనికి వెళ్తున్నాడు.

కామారెడ్డి నుంచి వస్తున్న తాడ్వాయి గ్రామానికి చెందిన డీసీఎం ఎలాంటి ఇండికేషన్ వేయకుండా పెట్రోల్ బంక్ లోకి మల్లించడంతో ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టగా కాట్రాల మల్లయ్య అక్కడికి అక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం హాస్పిటల్ కి తరలించమన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతిడికి ఒక కుమారుడు కుమార్తె ఉంది.
Next Story