చేతికొచ్చిన కూతురు శవంగా మారింది....

by Sridhar Babu |
చేతికొచ్చిన కూతురు శవంగా మారింది....
X

దిశ, వెల్గటూర్ : ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సందవేని శ్రీనివాస్, గంగమ్మ కుమార్తె శ్రీవాణి (20 )అనే యువతి ఆదివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ధర్మారంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న యువతి మానసిక వేధనకు లోనై జీవితం పట్ల విరక్తి చెంది ఇట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకుంది. శ్రీవాణి మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఎదిగిన కూతురు కళ్ల ముందే శవంగా పడి ఉండటం చూసి ఆ తల్లి దండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి దండ్రులు రోదిస్తున్న తీరు అక్కడికి వచ్చిన గ్రామస్తులను కంట తడి పెట్టిచ్చింది.

Next Story

Most Viewed