- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
బాధితుడి ఖాతాలో ‘సైబర్ క్రైమ్’ డబ్బు
దిశ, బాల్కొండ : ముప్కాల్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ నేరస్తుడి మాయలోపడి మోసపోయిన డబ్బును ముప్కాల్ పోలీసులు రికవరీ చేశారు. ఎస్సై రజినీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆన్లైన్ లో ఓ మీలటరీ వ్యక్తి తన బదిలీతో వేరో చోటుకు వెళ్తున్నానని ఇంట్లో ఉన్న సామాగ్రి తక్కువ ధరకు అమ్ముతున్నట్లు ఆన్ లైన్ లో పెట్టాడు. దీంతో కొత్తపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి సైబర్ వ్యక్తి మాటలు నమ్మి.. తన వద్ద వున్న డబ్బును సైబర్ నేరస్తుడి అకౌంట్ కు 1,14,998 రూపాయలను పంపాడు. అనంతరం తాను డబ్బును పొగుట్టుకున్నాని తెలుసుకున్న బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు డబ్బులను రికవరీ చేసే పనిలో పడ్డారు. సైబర్ క్రైమ్ పోర్టల్ లో రిపోర్ట్ చేసి 1,14,998 రూపాయలను అకౌంట్ హోల్డ్ లో పెట్టి కేసును ఛేదించారు. ఈ సందర్భంలో మంగళవారం రోజు ఉదయం సైబర్ మోసానికి గురైన బాధితుడికి మొత్తం డబ్బులను అతని ఖాతాలోకి జమ చేశారు. కేసులో ముఖ్య పాత్ర వహించిన పీసీ సాగర్ ను ఎస్ఐ రజినీకాంత్ ను స్థానికులు అభినందించారు. అనంతరం ఎస్ఐ రజినీకాంత్ మాట్లాడుతూ..ఆన్లైన్ లో మోసపోయిన వారు వెంటనే 1930 కాల్ చేయడం లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు.