శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత

by Disha Web Desk 20 |
శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
X

దిశ, శంషాబాద్ : గుట్టు చప్పుడు కాకుండా విదేశాల నుండి బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా మహిళ పట్టుబడ్డ ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో జరిగింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం దుబాయ్ నుండి (EK-526) ఎమిరేట్స్ విమానంలో వసీమ్ బేగం అనే మహిళ హైదరాబాద్ వచ్చేందుకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా మహిళపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు.

వసీమ్ బేగంను పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి లగేజీ బ్యాగును స్కానింగ్ చేయగా అందులో బంగారం ఉన్నట్లు గుర్తించారు. మహిళ ప్రయాణికురాలు 24 క్యారెట్ల బంగారు చైన్లను లగేజ్ బ్యాగులో పెట్టుకొని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళ వద్ద నుండి 25 లక్షల 76 వేల విలువ చేసే 500 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకొని మహిళను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Next Story