కల్తీ విత్తనాల పట్టివేత..

by Disha Web Desk 11 |
కల్తీ విత్తనాల పట్టివేత..
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట పట్టణంలోని గౌరీ శంకర్ ఫర్టిలైజర్ విత్తనాల దుకాణంలో 76 కిలోల తెల్ల కందులు, 64 కిలోల పెసర్లు, 101 కిలోల ఎర్రకందుల కల్తీ విత్తనాలను పట్టుకున్నట్లు నారాయణపేట సీఐ రవి బాబు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కల్తీ విత్తనాలను రైతులకు విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి కల్తీ విత్తనాలను పట్టుకున్నట్లు తెలిపారు. వ్యవసాయ అధికారి క్రాంతి ప్రదీప్ కుమార్ పంచనామా ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఎస్సై చంద్రశేఖర్, ఏఎస్ఐ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed