బతుకు దెరువుకు వచ్చి అనంత లోకానికి..

by Aamani |
బతుకు దెరువుకు  వచ్చి అనంత లోకానికి..
X

దిశ,దిలావర్పూర్ : దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామ సమీపంలో సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. దిలావర్పూర్ ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం దిద్దొలి రాజు,వయసు 45 తండ్రి పేరు సధశివ గ్రామం దాపద్రి, హిమాయత్ నగర్ మహారాష్ట్ర కు చెందిన రాజు మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ గృహ నిర్మాణ విధులు నిర్వహిస్తున్నారు. నిర్మల్ నుండి భైంసా వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సందీప్ సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.

Next Story

Most Viewed