జనగామలో కారు బీభత్సం

by Sridhar Babu |
జనగామలో కారు బీభత్సం
X

దిశ, జనగామ : జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం అతివేగంతో వచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రమాదంలో పాదచారులు గాయపడగా, షోరూమ్ ముందుట పార్కింగ్ ప్లేస్ లో ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. జనగామ వైపు నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి, అదుపుతప్పి బజాజ్ షోరూమ్ ముందు పార్కింగ్ ప్లేస్ లో ఉన్న వాహనాలపైకి దూసుకొని పోగా 9 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.

అక్కడ నిల్చున్న వాహనదారులు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. కానీ కొంతమందికి స్వల్ప గాయాలు కాగా వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్టుగా స్థానికులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story