- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రముఖ వ్యాపార వేత్త దారుణ హత్య.. మర్డర్ చేసిందెవరంటే..

దిశ, ఖైరతాబాద్ : వృద్దుడు, వ్యాపారవేత్తను ఆస్తికోసం సొంత మనవడే హత్యచేశాడు. అడ్డుకోబోయిన తల్లిపైన కత్తితో దాడి చేశాడు. అలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. సోమాజి గూడ డివిజన్ లోని బీఎస్ మక్తాకు చెందిన వి. చంద్రశేఖర్ జనార్ధన్ (84) వ్యాపారవేత్త. అతనికి బాలానగర్, తదితర ప్రాంతాల్లో ఇంజినీరింగ్ పరిశ్రమలు ఉన్నాయి. కోట్లాది రూపాయల ఆస్తి ఉండడంతో దాని పై మనుమడు కిలారు కీర్తి తేజ (23) కండ్లు పడ్డాయి. యూఎస్ లో ఎంఎస్ చేసిన కీర్తి తేజ ప్రస్తుతం లాంకోహిల్స్ లో నివాసం ఉంటున్నాడు.
గత కొంత కాలంగా ఆస్తికోసం తాతతో గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల జనార్థన్ రావు కంపెనీలో ఒక మనవడికి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చాడు.. చెడు వ్యసనాలకు బానిసైన కీర్తితేజకు డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదని ఈ నేపథ్యంలోనే గురువారం తన తాత వద్దకు వచ్చి గొడవకు దిగాడు. అతను మందలించడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా 73 సార్లు పొడిచాడు. దీంతో వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అడ్డువచ్చిన కన్న తల్లిపైన దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.