- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దుబాయ్‌లో జగిత్యాల జిల్లా వాసి దారుణ హత్య.. ఆలస్యంగా వెలుగులోకి

దిశ, జగిత్యాల ప్రతినిధి: బతుకుదెరువు కోసం దుబాయ్ కి వెళ్లిన జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన శ్రీనివాస్ తో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రేమ్ సాగర్ దారుణంగా హత్యకు గురయ్యారు. దుబాయ్ లో ఉన్న జిల్లా వాసుల సమాచారం మేరకు... జగిత్యాల జిల్లా ధర్మపురి కి చెందిన స్వర్గం శ్రీనివాస్ తో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రేమ్ సాగర్ దుబాయ్ లోని బేకరీలో పాకిస్తాన్ కు చెందిన యువకులతో కలిసి పని చేస్తున్నారు. ఈ క్రమంలో గత శుక్రవారం పాకిస్తాన్ చెందిన యువకుడు మతపరమైన నినాదాలు చేస్తూ కత్తితో భారతీయులపై దాడికి దిగాడు. ఈ దాడిలో శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడువగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాడికి పాల్పడిన నిందితుడిని దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా శ్రీనివాస్ మృతితో స్వగ్రామమైన దమ్మన్నపేట లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా శ్రీనివాస్ కు భార్య మంజుల ఇద్దరు కొడుకులు చందు, సూర్యలు ఉన్నారు.