- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
విద్యుదాఘాతంతో బాలుడు మృతి..

దిశ, పాపన్నపేట: మేనమామ నిశ్చితార్థ శుభకార్యానికి వెళ్లి విద్యుదాఘాతానికి గురై బాలుడు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని డాఖ్యా తండాలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, తండా వాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని నర్సింగరావు పల్లి తండాకు చెందిన కేతావత్ లక్ష్మణ్, షాను బాయ్ దంపతులకు ఇద్దరు కుమారులు. ఆదివారం షాను బాయ్ అన్న నిశ్చితార్థం ఉండడంతో డాఖ్యా తండాకు వెళ్లారు. పెద్ద కుమారుడైన కేతావత్ అనిరుద్(5) డీజే బాక్సులు ఉన్న ఆటోలో కూర్చున్నాడు. డీజే కు విద్యుత్ తీగల నుంచి సరఫరా తీసుకోగా.. రెండు వైర్లలో ఒక వైరు కింద పడి ఆటోకు తగలగా, ఆటోకు విద్యుత్ సరఫరా అవడంతో అనిరుద్ విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు, తండా వాసులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి అటు నుంచి మెదక్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అనిరుద్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇట్టి విషయమై స్థానిక ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ను వివరణ కోరగా.. ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.