రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి..

by Sumithra |
రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి..
X

దిశ, భైంసా : నిర్మల్ జిల్లా భైంసా మండలం జాతీయ రహదారి మాటేగావ్ టోల్ ప్లాజా - వానల్ పాడ్ గ్రామం మధ్య ఓ బాలుడు రోడ్డు ప్రమాదంలో అక్కడిక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కుబీర్ మండలం కుప్టి గ్రామానికి చెందిన జి.మల్లేష్ గత కొంత కాలంగా వ్యవసాయ కూలీగా పనిచేస్తూ, భైంసా మండలం వానల్ పాడ్ గ్రామంలో కుటుంబంతో సహా స్థిరపడి జీవనం కొనసాగిస్తున్నడు. అతని కొడుకు జీ.అనిల్ (13) కుంటాల మండలంలోని ఓ పాఠశాలలో 8 వ తరగతి చదువుతూ శనివారమే ఇంటికి వచ్చాడని తెలిపారు.

అయితే ఆదివారం ఉదయం తండ్రి వ్యవసాయ క్షేత్రంలో నీళ్లు పట్టడానికి వెళ్ళగా ద్విచక్ర వాహనాన్ని తీసుకొని అనిల్ ఆదివారం ఉదయం వానల్ పాడ్ అవుట్ స్కాడ్ లో వెళ్ళగా రోడ్డు ప్రమాదం జరిగి తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మరణించాడని వాపోతున్నారు. అయితే సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ అదుపు తప్పి పడిపోయాడా..? లేక ఏదైనా వాహనం ఢీ కొట్టిందా..? అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి వుంది. ప్రస్తుతం భైంసా రూరల్ పోలీసులు డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం తెలియాల్సి వుంది.

Next Story

Most Viewed