విద్యుదాఘాతంతో బాలుడి మృతి

by Disha Web Desk 1 |
విద్యుదాఘాతంతో బాలుడి మృతి
X

దిశ, దౌల్తాబాద్: విద్యుదాఘాతంతో ఓ బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చెట్లనర్సంపల్లిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పసుల స్వామి, రేణుక దంపతుల కుమారుడు వినయ్ (12) భారీగా ఈదురుగాలలు, వర్షంతో విద్యుత్ స్తంభం నుంచి ఇంట్లోకి వచ్చే వైరు తేగిపడింది. దురుదృష్టవశాత్తు తెగిన సర్వీస్ వైర్ పై కాలుపెట్టిన బాలుడు కరెంట్ షాక్ కు గురయ్యాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Next Story

Most Viewed