- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రద్దీ ప్రదేశాల్లో ఉన్న వారే ఆ మహిళల టార్గెట్...అంత దొచేస్తారు..!

దిశ,యాదాద్రి భువనగిరి ప్రతినిధి : రద్దీగా ఉండే ప్రదేశాలలో బస్టాండ్, బ్యాంక్ ల వద్ద పర్స్, బ్యాగ్ లను దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర మహిళా నేరస్థులను రాచకొండ కమిషనరేట్ పరిధిలోని భువనగిరి టౌన్ పీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను యాదాద్రి భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర శనివారం భువనగిరిలో వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 11న భువనగిరి బస్టాండులో బస్సు కోసం వేచి చూస్తున్నా ఒక ప్రయాణికురాలి బ్యాగును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. వెంటనే గమనించిన మహిళ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఈ ఫిర్యాదు మేరకు భువనగిరి టౌన్ పోలీసులు రంగంలోకి దిగి సీసీ కెమెరాలు, అనుమానస్పద వ్యక్తులను ఆధారంగా చేసుకొని విచారణ ప్రారంభించారు. ఈ మేరకు శుక్రవారం మద్యాహ్నం భువనగిరి బస్టాండులో విశ్వసనీయ సమాచారం మేరకు భువనగిరి బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విజయవాడ జిల్లా రామవరపుపాడుకు చెందిన గన్నికోట దుర్గ, నక్క మంగ, వెస్ట్ గోదావరి జిల్లా చింతలకోటిగరువుకు చెందిన గండికోట లక్ష్మీలుగా గుర్తించారు. వీరిని విచారణ చేయడంతో నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.
వారి వద్ద నుండి రూ.3,40,000/- విలువ గల (బంగారు ఆభరణాలు, నగదు) స్వాధీనం చేసుకున్నారు. వీరితో పాటు నక్క మోహన్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడన్నారు. నిందితులు గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల ఇదే తరహా నేరాలకు పాల్పడినట్లు చెప్పారు.
నేరం చేసే విధానం....
ఈ నలుగురు వ్యక్తులు రద్దీగా ఉండే ప్రదేశాలలో అనగా బస్టాండ్, బ్యాంక్లు, రైతు బజార్ ల వద్ద చిన్న పిల్లలను వెంట తీసుకొని దొంగతనం చేస్తే ఎవరికి అనుమానము రాదనే ఉద్దేశంతో ఈ నెల 10న తొర్రురు ఎస్బీఐ బ్యాంకు వద్ద ఒక మహిళ కవర్లో డబ్బులు పెట్టుకొని బ్యాంకులోకి వెళ్తున్న క్రమంలో ఎవరికీ కనపడకుండా అడ్డుగా ఉండి ఆమె నుంచి రూ. 40 వేలు దొంగతనం చేశారు. అదే తరహాలో 11న భువనగిరి బస్ స్టాండ్ లో ప్లాట్ ఫారం వద్ద ఒక మహిళ తన పిల్లలతో కలిసి ఉండగా, ఆమె పర్స్ ని బట్టల బ్యాగ్ నుండి 5 తులాల బంగారు ఆభరణాలు రూ. 5 వేల నగదు దొంగలించారు. 13న కోరుట్ల బస్ స్టాండ్ లో ఒక మహిళ బట్టల బ్యాగు పట్టుకొని బస్సు ఎక్కుతుంటే, పక్కన నిలబడి ఎవరికీ కనపడకుండా అడ్డుండి ఆమె వద్ద నుండి 3 తులాల బంగారు ఆభరణాలు దొంగలించి యోహన్ కారులో పారిపోయారు. 14న నలుగురు వ్యక్తులు నలుగురు వ్యక్తులు భువనగిరిలో దొంగతనం చేద్దామని కారులో వచ్చారు. కారును యోహన్ బస్ స్టాండ్ బయట నల్గొండ వైపు వెళ్ళే రోడ్డు పక్కన ఆపుకొని ఉండగా ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఇదే క్రమంలో యోహన్ కార్ ను వదిలి పెట్టి పారిపోయాడు.
గతంలో రెండు రాష్ట్రాల్లో.....
గతంలో ఈ నిందితులపై విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, క్రిష్ణ, తూర్పుగోదావరి, కడప, ప్రకాశం, తిరుపతి, మహబూబాబాద్, జగిత్యాల, గాజువాక జిల్లాలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లినట్లు చెప్పారు. 2024 ఆగస్టు నెలలో తిరుమల టౌన్ పీఎస్ లలో పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేసి తిరుపతి జైలు కు వెళ్లి జైలు నుంచి (2025) జనవరి నెల మొదటి వారం లో బయటకు వచ్చి తిరిగి మళ్లి దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తులను పట్టుబడడం జరిగింది. వీరి వద్ద నుంచి భువనగిరి టౌన్ పీఎస్ కు సంబంధించి 4.2 తులాల బంగారు తాడు, 4 గ్రాముల వంకు, 4 గ్రాముల గోల్డ్ రింగ్ ను, కోరుట్ల పీఎస్ పరిధిలో తులంనర చైన్, అర్థతుల చైన్, ఆరు గ్రాముల చెవి దిద్దులు, 0.8 గ్రాముల లాకెట్, తొర్రురు పీఎస్ కు సంబంధించి రూ. 20 వేలు, గాజువాకకు సంబంధించి 4 తులాల గోల్డ్ చైన్ ను రికవరీ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ కేసులో భువనగిరి ఏసీపీ రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, ఎస్ఐ కుమార స్వామి, సిబ్బందిని అభినందిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పట్టణ పీసీలు రమేష్, కొండారెడ్డిలు పాల్గొన్నారు.