యాచకురాలి పై అత్యాచారం.. హత్య..?

by Sumithra |
యాచకురాలి పై అత్యాచారం.. హత్య..?
X

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడకు చెందిన ఓ మహిళ జిల్లా కేంద్రంలో యాచకురాలిగా జీవనం సాగిస్తుంది.

ఈ క్రమంలో బుధవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి వెనుక మృతి చెందినట్లుగా సమీపంలో ఉన్న స్కూల్ యాజమాన్యం, స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు, సీఐ కనకయ్య, ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా ఘటనా స్థలంలో ఒక ప్యాంటు, టవల్ ఉండడం, మృతదేహం పరిస్థితిని గమనిస్తే గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం జరిపి.. హతమార్చి ఉంటారు అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు సమాచారం. కాగా ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed