- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పని చేయడం ఇష్టం లేక ఇంటికి వస్తానంటే వద్దన్నందుకు...
by Sridhar Babu |

X
దిశ, గంగాధర రామడుగు : మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజ్ కుమార్ పటేల్ అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు అందించిన సమాచారం మేరకు గంగాధర మండలం ఓద్యారం గ్రామ శివారులోని ఎస్వీజీ గ్రానైట్ క్వారీలో గత కొద్ది కాలంగా కూలీగా పని చేస్తున్నాడు.
కాగా గత వారం రోజుల నుండి తనకు ఈ పని ఇష్టం లేదని, ఇంటికి వస్తానని తన తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూ ఉన్నాడు. కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల తల్లిదండ్రులు రావద్దని చెప్పడంతో మనస్థాపం చెందిన రాజ్ కుమార్ ఆదివారం క్వారీ సమీపంలో ఒక వేపచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరుడు కన్యలాల్ పటేల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Next Story