గోపాల్ పేట ఎస్సీ హాస్టల్‌లో బాబు మిస్సింగ్..అసలు ఆ హాస్టల్‌లో ఏం జరుగుతుంది..?

by Aamani |
గోపాల్ పేట ఎస్సీ హాస్టల్‌లో బాబు మిస్సింగ్..అసలు ఆ హాస్టల్‌లో ఏం జరుగుతుంది..?
X

దిశ,గోపాల్ పేట : మండల కేంద్రంలో గల ఎస్సీ బాలుర హాస్టల్ లో సందీప్ S/o శ్రీవాటి కురుమూర్తి గ్రామం,4వ తరగతి చదువుతున్నాడు. సందీప్ నిన్న అనగా బుధవారం సాయంత్రం 6:30 కు గోపాల్పేట బస్టాండ్ కి వచ్చి ఒక వ్యక్తి దగ్గర ఫోను ద్వారా వాళ్ల నాన్న నెంబర్ కి ఫోన్ చేసి నోట్ బుక్స్, బ్యాగ్ లేదు డబ్బులు కావాలి అని అడిగాడు. ఫోన్ పే ద్వారా రూ.200 ట్రాన్స్ఫర్ చేసిన తండ్రి ఆ తర్వాత బాబు నోట్ బుక్స్ బ్యాగ్ కొనుక్కోకుండా సందీప్ ఎవరికి చెప్పకుండా ఎటు పోయిందో తెలియదు.తోటి స్నేహితులు హాస్టల్ వార్డెన్ హాస్టల్ రూమ్ లో చుట్టుపక్కల వెతకగా సందీప్ కనిపించలేదు. బాబు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పగా ఫోన్ చేసి 9010083996, 76608 80618 బాబు తల్లిదండ్రులు తెలిసిన వాళ్ళ బంధువులకు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేయగా ఇంతకుముందు హైదరాబాద్ బస్టాండ్ లో ఉన్నాడని బంధువుల ద్వారా తెలుసుకున్న తల్లిదండ్రులు,బాబును వరుసకు బాబాయి అయిన ఆటో డ్రైవర్ వద్దకు ఇంతకుముందు చేరుకున్నారని అబ్బాయి తండ్రి తెలియజేశారు. ఇంత జరుగుతున్న హాస్టల్ వార్డెన్ ఏం చేస్తున్నారని విషయం కూడా తెలియకుండా ఉన్నరని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.

Next Story