ఈ దారుణాలు ఆగేనా.. ఏపీలో మరో మహిళపై అత్యాచారయత్నం.. అక్కడికి తీసుకెళ్లి మరీ

by Disha Web |
ఈ దారుణాలు ఆగేనా.. ఏపీలో మరో మహిళపై అత్యాచారయత్నం..  అక్కడికి తీసుకెళ్లి మరీ
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో వరసగా అత్యాచారాలు జరుగుతున్నాయి. మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా వారిపై దాడులనేవి ఆగడం లేదనడానికి విజయవాడ ఆసుపత్రిలోని ఘటనే నిదర్శనం. అంతే కాకుండా గుంటూరులో ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ సంఘటన మరవక ముందే గుంటూరు జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని దుగ్గిరాల మండలంలోని ఓ మహిళపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారాని యత్నించారు. ఓ గ్రామానికి కూలి పనికోసం వచ్చిన మహిళలు, గ్రామంలోని ఆలయంలో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఓ మహిళను పొలాల్లోకి లాకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించారు. బాధిత మహిళ కేకలు వేయడంతో అక్కుడున్నవారు అలర్ట్ అయ్యారు. దీంతో ప్రమాదం తప్పింది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed