- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- ఫోటోలు
- ఉగాది రాశి ఫలాలు
- Job Notifications
- OTT Release
- భక్తి
దళిత మాజీ సర్పంచ్‌పై దాడి
by Disha Web |

X
దిశ, ఆర్మూర్: దళిత మాజీ సర్పంచ్ పై కొంత మంది దాడికి తెగబడ్డారు. ఆర్మూర్ మండలంలోని ఇసాపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మెట్టు నరేష్‌పై అదే గ్రామానికి చెందిన ఇద్దరు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు దాడికి పాల్పడ్డారు. ఆర్మూర్‌లోని ఎల్ఐసీ ఆఫీసు నుండి వెంబడించి ఆలూరు బైపాస్ రోడ్డు వద్ద వారి బైకులు అడ్డంగా పెట్టి ఆయనను పోనీయకుండా ఆపి కులాన్ని దూషిస్తూ దాడి చేశారు.
మెట్టు నరేష్ సర్పంచిగా ఉన్నప్పుడు వీరి మధ్య గొడవ జరిగిందని దాన్ని మనసులో పెట్టుకొని మంగళవారం మాజీ సర్పంచిపై దాడి చేయడంతో పాటు కులాన్ని దూషించారు. ఆ టైంలో అటుగా వస్తున్న ఇసాపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆపి వారి నుంచి మాజీ సర్పంచిని రక్షించారు. ఈ విషయమై దళిత నాయకులతో కలిసి ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి దాడికి గురైన ఇస్సపల్లి మాజీ సర్పంచ్ మెట్టు నరేష్ ఫిర్యాదు చేశారు.
Next Story