అంబర్ పేటలో దారుణం.. భర్త వేధింపులు తట్టుకోలేక భార్య సూసైడ్

by Kalyani |
అంబర్ పేటలో దారుణం.. భర్త వేధింపులు తట్టుకోలేక భార్య సూసైడ్
X

దిశ, కాచిగూడ : కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై అంబర్ పేట పటేల్ నగర్ లో రేఖ అనే మహిళ పెట్రోల్ పోసుకుని కాల్చుకుంది. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. అంబర్ పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామబిపేట మండలం, ఇస్సానగర్ కు చెందిన సంగెపు నారాయణ కుమార్తె రేఖ (27) కు 2018 లో కామారెడ్డి జిల్లా, దోమకొండ మండలం అంబర్ పేట గ్రామానికి చెందిన పిడుగు నవీన్(37) తో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. స్క్రాప్ వ్యాపారం చేస్తున్న నవీన్ గత కొన్నేళ్లుగా తాగుడుకు బానిసై శారీరకంగా మానసికంగా భార్యను వేధించేవాడని, అక్రమ సంబంధం పెట్టుకుందంటూ అసభ్య పదజాలంతో దూషించేవాడని రేఖ తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు.

మనస్థాపానికి గురైన రేఖ ఈనెల 10వ తేదీన సాయంత్రం 4 గంటల సమయంలో తన ఇంట్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తెలిపారు. చికిత్స నిమిత్తం భర్త నవీన్ ఉస్మానియా హాస్పిటల్ లో చేర్పించడని తెలిసింది. ఉత్తమ వైద్యం నిమిత్తం ఆమె తల్లిదండ్రులు కాచిగూడ లోని టిఎక్స్ హాస్పిటల్ లో చేర్చారు. తమ కూతుర్ని అల్లుడు నవీను బైక్ లో పెట్రోల్ తీసి కాల్చి చంపాడని వాపోయారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మరణించిందని తెలిపారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో అంబర్ పేట పోలీసులు Cr.no.108/2025 U/s 85, 103(1)Bns సెక్షన్ లలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed