- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- ఉగాది రాశి ఫలాలు
- Job Notifications
దారుణం.. భార్యను డంబెల్‌తో కొట్టి చంపిన భర్త

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత కాలంలో కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాల వల్ల దంపతులు గొడవలు పెట్టుకుంటున్నారు. చిన్న సమస్యలను పెద్దవి చేసుకుని కొంత మంది ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా, కర్ణాటకలోని కృష్ణరాజపురం పరిధిలో ఓ వ్యక్తి క్షణికావేశంలో భార్యను డంబెల్‌తో కొట్టి చంపేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణరాజపురం పరిధిలో మోరిస్, లిడియా అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. మోరిస్ ప్రైవేట్ ఉద్యోగిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే గురువారం పిల్లలు స్కూల్‌కు వెళ్లిన తర్వాత ఏదో కారణంతో దంపతుల మధ్య గొడవ మొదలైంది. అది కాస్త పెరగడంతో కోపంతో ఊగిపోయిన మోరిస్ ఇనుప డంబెల్‌లో లిడియా తల మీద పదే పదే కొట్టాడు. దీంతో ఆమె అరవడంతో చుట్టు పక్కల వారు విని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. లిడియాను గట్టిగా పదే పదే తలపై కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.