- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దారుణ హత్య..కన్న కూతురిని వేధిస్తుండటంతో..

దిశ,దేవరకద్ర/చిన్నచింతకుంట: కన్న కూతురిని వేధిస్తున్నాడని ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన కౌకుంట్ల మండలం తిరుమలపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు, చిన్న చింతకుంట ఎస్సై శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం నందికొట్కూరు గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ రెహమాన్ కూతురు ని కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన అలీ ఖాన్ వెంటపడి వేధిస్తున్నాడు. అలికాన్ వేధింపులు భరించలేక అమ్మాయి బంధువుల గ్రామం కౌకుంట్ల మండలం తిరుమలాపూర్ గ్రామానికి వచ్చారు. మృతుడు అలి ఖాన్ కూడా తిరుమలాపూర్ గ్రామానికి రావడంతో అమ్మాయి తండ్రి కి అలికాన్ కి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అమ్మాయి తండ్రి షేక్ అబ్దుల్ రెహమాన్ ఆవేశంతో గురువారం మూడు గంటల సమయంలో ఇనుప రాడ్డు,బండ రాయి తో దాడి చేసి హత్య చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.మృతిని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు.