ఆన్లైన్ రమ్మీ గేమింగ్ కు మరో యువకుడు బలి

by Sridhar Babu |
ఆన్లైన్ రమ్మీ గేమింగ్ కు మరో యువకుడు బలి
X

దిశ, శంకర్పట్నం : సెల్ఫోన్ ఉంటే చాలు యువత ఏ దారిన పోతుందో ఏ వ్యసనానికి బానిసవుతుందో తెలియని రోజుల్లో ఉన్నారు. జూదం ఒకప్పుడు పరస్పరం ఇరువురు వ్యక్తులు కలిసి ఆడేవారు. కానీ ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో సెల్ ఫోన్ లోనే ఆన్లైన్ బెట్టింగులు, జూదం ఆడుతూ యువత బలైపోతుంది. అదే కోవలో మండల పరిధిలో ఓ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... శంకరపట్నం మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఎడిగ మధు (33) అనే యువకుడు వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ మధ్య కాలంలో తన భర్త ఆన్లైన్లో రమ్మీ ఆడుతూ బెట్టింగులు నిర్వహిస్తూ దాదాపు రూ.10 లక్షల పైనే అప్పులు చేశాడని, దీంతో అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మానసిక వేదనకు గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో గత సోమవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మరణించినట్లు మృతుని భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొత్తపల్లి రవి తెలిపారు.

Next Story