సినీ ఇండస్ట్రీ లో మరో ఘరానా మోసం

by Sridhar Babu |
సినీ ఇండస్ట్రీ లో మరో ఘరానా మోసం
X

దిశ, మేడిపల్లి : సినిమా ఇండస్ట్రీ లో ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే తమేంటో నిరూపించుకుంటాం అంటూ పలువురు ఛాన్స్ కోసం చేసే ప్రయత్నంలో పలువురి మాయ మాటలు నమ్మి ఇప్పటికీ ఎంతో మంది మోసపోతూనే ఉన్నారు. ఇదే తరహా మోసం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బోడుప్పల్ లో జరిగింది. ఓ నూతన డైరెక్టర్ పై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు. బాధితుల వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన సునీత, శంకర్ లు సోషల్ మీడియాలో మేడ్చల్ జిల్లా బోడుప్పల్ కు చెందిన శ్రీ వెంకటలక్ష్మి నరసింహ ప్రొడక్షన్స్ నిర్వాహడు డైరెక్టర్ వెంకట నరసింహ రాజుని సంప్రదించారు.

వారికి పలు సినిమాల్లో అవకాశం కల్పిస్తానని నమ్మపలికి బాధితులు సునీత, శంకర్ ల నుండి ఎనిమిది లక్షలు వసూలు చేశాడు. ప్రముఖ హీరో సుమన్, భానుచందర్ ప్రియమణి ల కంబినేషన్ లో తీస్తున్న సినిమాలో లెక్చరర్ క్యారెక్టర్ ఇస్తానని అంతేకాకుండా అల్లుడు బంగారం, నేను నా లవర్ కి బ్రేకప్ అయ్యింది, సీఎం, అమ్మ నాన్న తదితర సినిమాల్లో కూడా నటులుగా అవకాశాలు ఇస్తానని చెప్పి చివరకు మోసం చేశాడు. తమవద్ద నుండి తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించడం లేదని బాధితులు వాపోయారు. తామే కాదని ఇతని బారిన మోసపోయినవారు చాలా మంది ఉన్నారని అన్నారు.

తమలా మరెవరూ మోసపోకూడదు : బాధితులు

తమలా మరెవరూ మోసపోకూడదని, అందుకే బాధితునిపై పోరాటానికి దిగామని, మేడిపల్లి పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేశామని, డైరెక్టర్ వెంకట నరసింహ రాజు పై కేసు నమోదు చేశారని బాధితులు తెలిపారు. సినిమాలో ఛాన్స్ కోసం వచ్చి అప్పుల పాలయ్యామని తమ డబ్బు తమకు తిరిగి ఇప్పించి, మరెవరినీ ఇలా మోసం చేయకుండా డైరెక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Next Story

Most Viewed