- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జనగామలో మరో అగ్ని ప్రమాదం..
by Sumithra |

X
దిశ, జనగామ : జనగామ జిల్లాలో వేసవికాలం ఆరంభంలోనే అగ్ని ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. జిల్లా కేంద్రంలో బస్టాండ్ సమీపంలో హైదరాబాద్ రోడ్డులో గల భవాని ప్లైవుడ్ షాప్ లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షాప్ నుండి మంటలు ఎగిసి పడడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది స్పందించి అదుపులోకి తెచ్చారు.
ప్లైవుడ్ స్టాక్ ఉండే ఈ జై భవాని ప్లైవుడ్ అండ్ సానిటరీ షో రూమ్ లో ప్లైవుడ్ తో పాటు ఇతర సామాగ్రి కాలి బూడిద అయినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదానికి షాక్ సర్క్యూట్ కారణమని తెలుస్తుంది. దాదాపు షాప్ అంతా అగ్ని ప్రమాదం వల్ల కాలిపోయినట్లు, సామాగ్రి అంతా పూర్తిగా మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తుంది. పెరుగుతున్న అగ్ని ప్రమాదాలను తగ్గించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు.
Next Story